మా అమ్మ వాళ్ల మేనమామ గారు లక్ష్మినగార్ లో ఉంటారు..వాళ్ళకి తోటలు పొలాలు పాడి బాగా ఉన్నాయి..మా ఉహా తెలిసిన దగ్గరనుంచీ రాంబాబు అనే పాలేరు అబ్బాయి ఉండేవాడు..తనకి ఎవరు లేరు అందుకని మా తాతగారి ఇంట్లోనే ఉండేవాడు..రోజు గెదలని అవుని పొలం తీసుకు వెళ్ళడం వీడి పని ఇంటికి వచ్చాక గొడ్లసావిట్లో కట్టి అక్కడే తిని పడుకునేవాడు ..మాకు పొలం నుంచి తాటికాయలు, తాటి ఆకుల మంట మీద కాల్చిన బొబ్బర్ర్లు లాంటివి అన్ని తెచేవాడు..



ఒకరోజు పొలం వెళ్తున్నాడు అక్కడ వాడికి అక్కడే పుట్టలోకి వెళ్ళిపోతున్న పాము కనిపిస్తే దానిని పుట్టలోకి వెళ్లనివ్వకుండా దాని తోక పుచ్చుకుని బలం గా లాగాలని చూసాడు ఎంత బలం గా అంటే వాడి చేతికి దాని తోక సగం తెగి చేతికి వచ్చేసింది అంట వెంటనే వీడు కలుగులో కర్రతో నాలుగు సార్లు పొడిచాడు అంట దాని తల భాగం కూడా చచ్చిపోవాలి అని, కర్రకి అంటుకున్న బ్లడ్ చూసి ఇంకా చచ్చింది అని పొలం వెళ్ళి వాడి పని చూసుకుని ఇంటికి తిరిగి వాచాడు..ఇంటికి రాగానే గెదలని కట్టి దాన వేసి పాలు తీసి వాడి పనులు అన్ని పూర్తిచేసాడు.

మా మామ్మ అన్నం కి పళ్లెం తెచుకో అని పిలిస్తే పళ్లెం తెచుకోడానికి గొడ్లసావిట్లో కి వెళ్లాడు..ఎప్పుడు వాడు గొడ్లసావిట్లో ఉన్న గూట్లో తన పళ్లెం గ్లాస్ ఉంచుకునేవాడు..ఆది తెచుకోడానికి వెళ్లాడు కాసేపాటికీ మాకు గట్టిగా వాడి అరుపు వినిపించింధీ వెళ్ళి చూస్తే అక్కడ నడుం వరకు ఉన్న పాము వాడి చేతిని గట్టిగా కాటు వేసి అలానే ఉంది రాంబాబు నోట్లో నుంచి నురగలు వస్తున్నాయ్ చచిపోయాడుపాపం ...

అప్పట్నుంచి నాకు పాము చూస్తే టెరర్..ఆ ఇన్సిడెంట్ మైండ్ లో బాగా గుర్తు మా అందరికి ...

నాకు పాము అంటే చాలా భయం...అందుకే ఈ పోస్ట్ కి పిక్చర్ కూడా పాము పెట్ట లేదు..

1 comments:

amma odi said...

"విజయ దశమి శుభాకాంక్షలు"